TG: హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి బీజేపీ నేతలు యత్నించారు. దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీభవన్ వైపునకు దూసుకెళ్లేందుకు బీజేపీ నేతలు యత్నించారు. BJP యువమోర్చా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, నేతల మధ్య తోపులాట జరిగింది.