ఐరోపా ఖండంలోని రెండు దేశాలైన బెలారస్, లిథువేనియా మధ్య బెలూన్ల కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి బెలారస్ ప్రయోగించిన వెదర్ బెలూన్లు అదుపు తప్పి లిథువేనియా గగనతలంలోకి వెళ్లిపోతున్నాయి. దాంతో అక్కడి విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ క్రమంలో ఇరుదేశాలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నాయి.