BHPL: పట్టణంలోని కారల్ మార్క్స్ కాలనీలోని శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయ 11వ వార్షికోత్సవ వేడుకలు ఇవాళ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు MLA గండ్రను శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.