‘పలాస’ హీరో రక్షిత్ (Rakshit) హీరోగా నటిస్తోన్న రీసెంట్ చిత్రం ఆపరేషన్ రావణ్ (Operation RAAVAN). ఈమధ్యనే ఈ మూవీకి సంబంధించిన లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఆపరేషన్ రావణ్ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో(Glimpse Video Viral)ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇంటెన్సివ్‌గా, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ సాగుతుందని గ్లింప్స్ వీడియోను చూస్తే అర్థమవుతుంది.
‘ఆపరేషన్ రావణ్’ గ్లింప్స్ వీడియో:
మీ ఆలోచనలే మీ శత్రువులు.. అనే ట్యాగ్‌లైన్‌తో హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆపరేషన్ రావణ్ తెరకెక్కుతోంది. గ్లింప్స్ వీడియో(Glimpse Video) ఈ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. ఈ సినిమాలో మలయాళ భామ సంగీర్తన విపిన్ హీరోయిన్గా నటిస్తోంది. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కమ్ యాక్టర్ రఘు కుంచె ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించనున్నాడు.
హీరో రక్షిత్ మరోవైపు రొమాంటిక్ ఎంటర్టైనర్ శశివదనే (Sasivadane)తోపాటు నరకాసుర అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. శశివదనే మూవీలో కోమలీ ప్రసాద్ (Komalee Prasad) హీరోయిన్గా నటిస్తోంది. సాయి మోహన్ ఉబ్బన ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. సుధాస్ మీడియా బ్యానర్ మీద ధ్యాన్ అట్లూరి నిర్మిస్తున్న ఈ న్యూ ఏజ్ యాక్షన్-సస్పెన్స్ థ్రిల్లర్ ఆపరేషన్ రావణ్ లో రక్షిత్ అట్లూరి సరసన సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ‘ఫస్ట్ థ్రిల్’ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకులు మారుతి, కళ్యాణ్ కృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ఓ తండ్రి కొడుకును పెట్టి డైరెక్ట్ చేయడం అరుదుగా జరుగుతుంది. ఆ అరుదైన ఘటన ఈ ఆపరేషన్ రావణ్ కు జరిగింది. నాకు ప్రసాద్ మంచి ఫ్రెండ్. ఆయనలో చాలా ప్యాషన్ ఉంది. సినిమాను జాగ్రత్తగా తీయించుకునేవారు. అందుకు పలాస, లండన్ బాబులు ఉదాహరణలు. అలాంటి తను ఓ రోజు కథ రాసుకున్నాను. నేనే డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు. ఆశ్చర్యపోయాను. తర్వాత టీజర్ చూపించారు. చూడగానే చాలా ప్రామిసింగ్ గా ఉంది. కథను మాత్రమే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. అసలు తండ్రి కొడుకుతో ఇలాంటి సినిమా తీయాలన్న ఆలోచనే గొప్పగా ఉంది. మీ ఆలోచనలే మీ శతృవులు అనే క్యాప్షన్ కూడా బావుంది. ఈ ఫస్ట్ థ్రిల్ బావుంది. రక్షిత్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్.. అన్నారు.
తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ” రక్షిత్ అంతకు ముందు రెండు సినిమాలు చేశాడు. పలాసలో స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ చూపించాడు. ప్రసాద్ గారు డైరెక్షన్ చేస్తా అన్నప్పుడు నవ్వుకున్నా. బట్ ఇప్పుడు ట్రైలర్ చూశాక చాలా బావుంది” అన్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మాట్లాడుతూ ” చాలామంది సినిమా చేద్దాం అనుకున్నప్పుడు వెరైటీ స్టోరీ అని చెబుతున్నారు. హీరో ఎవరు అంటే ఫస్ట్ టూ ఆప్షన్స్ లో రక్షిత్ పేరు ఉంటుంది. అది అతని సక్సెస్ అని నేను అనుకుంటున్నా” అన్నారు.
హీరో రక్షిత్ మాట్లాడుతూ ” మా సినిమా ఫస్ట్ సక్సెస్ రాధిక గారు ఒప్పుకున్నప్పుడే జరిగింది. వెంకట సత్య వర ప్రసాద్ మా నాన్నగారు. ఈ చిత్రానికి దర్శకుడు. 1995లో స్వీట్ మ్యాజిక్ స్థాపించారు. అప్పుడు ఏం లేదు. కానీ ఇప్పుడు కొన్ని వేలమందికి ఉద్యోగం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోస్వీట్ మ్యాజిక్ తెలియని వారు ఉండరు. ఇప్పుడు ఆపరేషన్ రావణ్ తీశారు. ఈ మూవీ దేశం అంతా తెలుస్తుందనుకుంటున్నా” అన్నారు.