TG: హైదరాబాద్లోని చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం రేపాయి. యువకుల మృతదేహాలపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.