AKP: పాయకరావుపేట పోలీస్ స్టేషన్ను మంగళవారం అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను తనిఖీ చేశారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల పనితీరుపై మరింత దృష్టి పెట్టాలని సీఐ అప్పన్నను ఆదేశించారు. హైవేపై ఇష్టానుసారంగా లారీలు ఇతర వాహనాలు నిలపకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.