నిర్మాత నాగవంశీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ‘ఎపిక్’ మూవీ ఈవెంట్లో నాగవంశీ మాట్లాడుతూ.. ‘ఐబొమ్మ రవినే రాబిన్ హుడ్ చేసిన లోకంలో ఉన్నాం మనం’ అంటూ వ్యాఖ్యానించాడు. ‘రవి మాకు రాబిన్ హుడ్ అయిపోయాడు. రూ.50 టికెట్ రేటు పెంచితే, మేము ఏదో తప్పు చేసిన వారిలా అయిపోయాం. ఆ అబ్బాయి హీరో అయిపోయాడు’ అని ఆయన వ్యాఖ్యానించాడు. దీంతో ఈ వ్యాఖ్యలు SMలో వైరల్ అవుతున్నాయి.