KMM: పేదలకు ఇళ్లు అందించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి మున్సిపాలిటీ మసీద్ రోడ్ 4వ వార్డులో ఆరుగురు లబ్ధిదారుల ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.