W.G: భారత విద్యార్థి ఫెడరేషన్(SFI) జిల్లా గర్ల్స్ కన్వినింగ్ కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలోని ఓ కళాశాలలో అవగాహన సదస్సు సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా మాజీ SFI నాయకురాలు శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ డి.కళ్యాణి మాట్లాడుతూ.. మనదేశంలో మహిళలు పాత్ర అతి ముఖ్యంగా ఉందన్నారు. మహిళలు నింగి నుంచి నేల వరకు అన్ని రంగాల్లో ముందున్నారన్నారు.