VZM: ఇకపై జిల్లాలో కొత్తగా హెచ్ఐవి కేసులు నమోదు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్. రామసుందర్ రెడ్డి అధికారులను కోరారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలో ర్యాలీతో పాటు స్ఠానిక ఐఎంఏ హాలులో అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బాధితులతో కలిసి ఆయన సహపంక్తి భోజనాలు చేశారు.