BDK: చర్ల మండల కేంద్రంలోని సర్వే నంబర్ 117లో ఉన్న ముస్లింల అభివృద్ధి కోసం మసీదు పేరుపై గతంలో కేటాయించి నిలుపుదల చేసిన భూమిని బహుజన్ సమాజ్ పార్టీ చర్ల మండల నాయకులు ఇవాళ సందర్శించారు. వారు మాట్లాడుతూ.. 70 సంవత్సరాల క్రితం ఈ భూమిని వెనుకబడిన ముస్లిం సామాజిక వర్గానికి కేటాయించారని తెలిపారు. భూ కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలన్నారు.