లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళనలతో సభ మరోసారి వాయిదా పడింది. ‘SIR’ అంశంపై చర్చకు పట్టుబడుతూ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ ఎంత చెప్పినా వినకపోవడంతో.. సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఉదయం నుంచి ఇదే అంశంపై రచ్చ జరుగుతుండటంతో.. సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.