AP: కర్ణాటకలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు వెళ్తుండగా మధుగిరి వద్ద కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన దంపతులు మృతి చెందారు. మృతులు మడకశిర మండలం గుడ్డంపల్లికి చెందిన కృష్ణారెడ్డి, జ్యోతికగా పోలీసులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.