పార్లమెంట్ సమావేశాల వేళ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్షాలు ఎన్నికల ఓటమిని పక్కనపెట్టి, సభ అజెండాపైనే ఫోకస్ పెట్టాలని హితవు పలికారు. ఈ సెషన్ దేశ అభివృద్ధికి బాటలు వేయాలని ఆకాంక్షించారు. అనవసర గొడవలు కాకుండా.. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాలనే సభలో లేవనెత్తాలని, భారత్ ఓ సచేతన ప్రజాస్వామ్యమని మోదీ గుర్తుచేశారు.