విశాఖలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గాజువాక పోలీసుల వివరాల ప్రకారం.. 58వ వార్డు గొందేసువాని పాలెంలో నివాసం ఉంటున్న నాగిరెడ్డి పూర్తిగా మద్యానికి బానిస అయ్యాడు. ఏ పనికి వెళ్లకుండా అందరి దగ్గర అప్పులు చేశాడు. డబ్బులు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంటి వద్ద ఉరివేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.