ATP: కూచ్ బెహార్ అండర్ -19 క్రికెట్ ట్రోఫీలో భాగంగా సోమవారం నుంచి 4 రోజులు ఆంధ్ర, కర్ణాటక జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఆర్డీటీలోని రాయలసీమ క్రికెట్ మైదానాన్ని సిద్ధం చేశారు. ఆదివారం ఇరు జట్ల క్రీడాకారులు నెట్లో ముమ్మర సాధన చేశారు. భారత మాజీ ఆటగాడు, కోచ్ రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ కర్ణాటక జట్టు కెప్టెన్గా బరిలో దిగుతున్నాడు.