WGL: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బడి తండాలో గృహ హింస కేసు వెలుగుచూసింది. తన భర్త సురేష్ అక్రమ సంబంధం పెట్టుకుని తనను వేధిస్తున్నాడని మౌనిక ఆరోపించింది. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని ఆమె పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురైన మౌనిక ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా చికిత్స కొనసాగుతుంది.