పెద్ద నగరాల్లో నిలదొక్కుకునేందుకు, జీవనోపాధిని సంపాదించడానికి ప్రతీ వ్యక్తి కష్టపడుతుంటాడు. ఒత్తిడితో కూడిన ఉద్యోగం చేయడంలో అనారోగ్యం దరిచేరుతుంది. అయితే చైనాలో ఓ మహిళ తన తల్లిదండ్రులతో ఉండేందుకు ఉద్యోగాన్ని వదిలేసింది. అందుకుగాను ఆ వృద్ద తల్లిదండ్రులు ఆమెకు నెలకు రూ.47వేలను ఇస్తున్నారు.
నియానన్ ( 40) అనే మహిళ మీడియాలో 15 ఏళ్లపాటు పని చేసింది. అధిక ఒత్తిడి వలన చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యేది. కాగా… తన జీవనాన్ని కొనసాగించడానికి ఉద్యోగం చేయక తప్పని పరిస్థితి. ఆమె పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఉద్యోగాన్ని వదిలేసి తమతో ఉండమన్నారు. అందుకుగాను నెలకు రూ.40వేలను ఇస్తామని చెప్పారు.
దీంతో నియానన్ ఉద్యోగాన్ని వదిలేసి తల్లిదండ్రులతో ఉంది. వారితో షాపింగ్ కు వెళ్లడం, నృత్యం చేయడం, వంటలో సహాయం చేయడం లాంటివి చేస్తుంది. ఒక రకంగా కుమార్తెగా ఉండేందుకు ఉద్యోగాన్ని వదిలేసింది. డబ్బు సంపాదించాలన్న తపనకు మూలం ఒత్తిడి అని చెప్పింది నియానన్. కాగా.. తనకు తగిన ఉద్యోగం లభిస్తే తిరిగి ఉద్యోగానికి వెళ్లవచ్చని ఆమె తల్లిదండ్రులు తనకు తెలిపినట్లు తెలిపింది.
కార్యాలయ ఒత్తిడి అనేది సంస్థలలో ఉత్పాదకతను అలాగే ఉద్యోగుల ఆరోగ్యం, శ్రేయస్సును ప్రభావితం చేసే ప్రపంచవ్యాప్త సమస్య. వివిధ రకాల, కలయికల డిమాండ్లను నిర్వహించడానికి వ్యక్తి సామర్థ్యం, సామర్థ్యం ఆ కట్టుబాట్లను అధిగమించినప్పుడు పనిలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఈ ఒత్తిడి లక్షణాలు శారీరక, మానసిక, ప్రవర్తనాపరమైనవి కావచ్చు. అవి అలసట, కండరాల ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి, నిరాశ, ఆందోళన మొదలైనవి కూడా ఉండవచ్చు.