ఇండస్ట్రీ బాగుండాలి.. దీనిపై సినీపెద్దలు ఆలోచించాలని నటుడు బాలకృష్ణ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘అఖండ-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకలో బాలయ్య మాట్లాడారు. సినిమాల విషయంలో తాను కూడా కొన్ని తప్పులు చేశానని, అపజయాలకు కుంగిపోనని చెప్పుకొచ్చారు. సినిమాలను వేగంగా పూర్తిచేయాలని, సినీ పరిశ్రమలో క్రమశిక్షణ ఉండాలని పేర్కొన్నారు. గౌరవం లేని చోట తాను ఉండనని స్పష్టం చేశారు.