కర్ణాటకలో సీఎం కుర్చీ మార్పుపై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒకే వేదికపై కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ‘సువర్ణ మహోత్సవ’ అనే కార్యక్రమానికి హాజరైన వీరిద్దరూ.. పక్కపక్కనే కూర్చుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. బయట జరుగుతున్న రచ్చకు చెక్ పెడుతూ.. ‘మేం కలిసే ఉన్నాం’ అనే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.