విశాఖలో ఉత్తరాంధ్ర జోనల్ మండల అధ్యక్షుల శిక్షణ వర్గంలో భాగంగా చిలుకూరి బృందావన్ ఎస్టేట్లో ఇవాళ యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్యకర్తలతో కలిసి చేసిన యోగా సెషన్ ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీదేనని, దీనిని జీవన విధానంగా తీసుకోవాలన్నారు.