KMR: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత KMR పర్యటన ఉద్రిక్తంగా మారింది. అమృత్ గ్రాండ్ హోటల్లో మీడియా సమావేశం అనంతరం రైల్వే గేట్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి వచ్చిన కవిత అకస్మాత్తుగా రైల్వే ట్రాక్‌పైకి చేరుకుని భైఠాయించారు. KMRలో ప్రకటించిన బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అరగంటకు పైగా ట్రాక్‌పై భైఠాయించి నిరసన తెలిపారు.