ELR: పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం అనేక పథకాలను, వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో బాధపడుతున్న 43 మందికి రూ.22 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే అందించారు.