ATP: మాక్ అసెంబ్లీకి వెళ్లి వచ్చిన గుత్తి ఆర్ఎస్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి స్వప్నకు శుక్రవారం ఆత్మీయ అభినందన సభను ఏర్పాటు చేశారు. ఎంఈఓ రవి నాయక్ హాజరయ్యారు. విద్యార్థి స్వప్నను శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడలో జరిగిన మాక్ అసెంబ్లీలో స్వప్న పాల్గొనిందన్నారు.