AP: రాష్ట్రంలో గత ఐదేళ్లు విధ్వంసం జరిగిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు రాజధానికి ఇచ్చారని గుర్తు చేశారు. ఇక్కడున్న ఫైనాన్షియల్ సిటీ దేశంలో ఎక్కడా లేదన్నారు. వినూత్నమైన నగరాన్ని నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ వస్తున్నారని వెల్లడించారు.