MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద కారు, స్కూటీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో గంగాపూర్‌కు చెందిన యాదమ్మ, బాలస్వామి గౌడ్ దంపతులు, బోయినపల్లి గ్రామం నుంచి కల్వకుర్తి వైపు వెళుతున్న చంద్రధన గ్రామానికి చెందిన రహమాన్, ఇసాక్‌లు గాయపడ్డారు. వీరిలో రహమాన్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు.