MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలను ప్రలోభ పెట్టే నగదు, మద్యం, కానుకల పంపిణీ, ప్రచారం, అక్రమ నగదు రవాణా, ఇతర ప్రభావిత అంశాలపై నిఘా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అంశాలు ఎవరి దృష్టిలోకైనా వస్తే కంట్రోల్ రూమ్ నం.08736- 250501లో ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు.