సత్యసాయి: కనగానపల్లిలోని శ్రీ తిరుమలరాయుడు స్వామి దేవస్థానం వరకు మట్టి రోడ్డు నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేశులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ రామకృష్ణ, ఎంపీటీసీ భాస్కర్, సరిపుటి బాలయ్యతో సహా పలువురు నాయకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు.