NRML: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొత్తం సాఫీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖానాపూర్ మండలంలోని సత్తనపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.