అమెరికా(America)లో మరో కాల్పుల ఘటన కలకలం రేపింది. న్యూ మెక్సికో (Mexico) రాష్ట్రంలోని రెడ్ రివర్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. కాగా, కాల్పులకు పాల్పడినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రెడ్ రివర్ నగర మేయర్ లిండా కాల్హన్ (Linda Calhan) తెలిపారు. రెడ్ రివర్ మెమోరియల్ డే సందర్భంగా నిర్వహించిన ఓ మోటార్ సైకిల్ ర్యాలీ సందర్భంగా కాల్పులు జరిగాయని వివరించారు. బైకర్ గ్యాంగుల (Biker gangs) సభ్యులు ఈ కాల్పులు జరిపారని మేయర్ వెల్లడించారు. గాయపడిన వారిని టావోస్(Taos) లోని హోలీ క్రాస్ ఆసుపత్రికి, అల్బుక్విర్క్ లోని న్యూ మెక్సికో యూనివర్సిటీ హెల్త్ సెంటర్ కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.