AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం వణికిస్తోంది. ప్రస్తుతం గంటకు 8 కి.మీల వేగంతో కదులుతుండగా.. సాయంత్రానికి తుఫానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పుదుచ్చేరి సమీపంలో తీరం దాటనుందని అంచనా వేస్తున్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రాష్ట్రంలోని ప్రధాన పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.