KMM: నగరంలో ప్రధాన రవాణా కేంద్రమైన రైల్వే స్టేషన్ వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించింది. రహదారిని వెడల్పు చేసే క్రమంలో బుధవారం షాపింగ్ కాంప్లెక్స్‌లను తొలగించి, పక్కనే డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులు జేసీబీలతో ముమ్మరం చేశారు. పాత మున్సిపాలిటీ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి.