KDP: ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తలపనూరు ప్రజల కోరిక ఎమ్మెల్యే చైతన్య కృషితో నెరవేరింది. వైవీ రోడ్డు నుంచి తలపనూరు గ్రామానికి వెళ్లేందుకు మధ్యలో వంక ఉండటంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. సమస్యను ఎమ్మెల్యే చైతన్య దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన స్పందించి రూ.30 లక్షల నిధులతో వంతెన నిర్మాణం పూర్తి చేయించి బుధవారం రాత్రి ప్రారంభించారు.