GNTR: తెనాలి పట్టణానికి చెందిన పొదుపు సంఘ మహిళలు బుధవారం రాత్రి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ సంఘ పర్యవేక్షకులు తమను మోసం చేశారని, తాము చెల్లించిన నగదు బ్యాంకులో జమ చేయకుండా, ఫోర్జరీ సంతకాలతో వ్యక్తిగత రుణాలు తీసుకున్నారని ఆరోపించారు. తాము తీసుకున్న రుణం తీరిపోయిందని బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఈ విషయం బయటపడిందని తెలిపారు.