BDP: సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా దమ్మపేటలో వల్లీ-దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో వెలుగొంది. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.