WGL: పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఇవాళ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ డా. సత్యశారదాదేవి కార్యక్రమంలో పాల్గొని అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం మన దేశందే కావడం మనందరికీ గర్వకారణం అని కలెక్టర్ అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు.