ATP: విజయవాడలో బుధవారం జరిగిన ఏపీఐఐసీ (APIIC) డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అనంతపురం శాసన సభ్యులు దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్లను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఏపీఐఐసీ ద్వారా పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.