KMM: కోత, కుట్టు లేని వేసెక్టమీ ఆపరేషన్ ఐదు నిమిషాల్లో పూర్తవుతుందని, మహిళలకు ఇబ్బంది తగ్గించడానికి పురుషులే ముందుకు రావాలని డీఎంహెచ్వో డా. రామారావు సూచించారు. కుటుంబ నియంత్రణ పద్ధతుల్లో పురుషుల భాగస్వామ్యం పెరగాలని పిలుపునిచ్చారు. వేసెక్టమీ అవగాహన పక్షోత్సవాల సందర్భంగా కలెక్టరేట్లో వారు మాట్లాడారు. ఇది ట్యూబెక్టమీ కన్నా సులువైనదని తెలిపారు.