NLR: అట్టడుగు, అణగారిన వర్గాల అభ్యున్నతి, ప్రజాస్వామ్య పరిఢవిల్లత, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం వంటి విలువలకు మార్గదర్శక దీప స్తంభం రాజ్యాంగమని ప్రధానోపాధ్యాయురాలు పి. వేదవతి అన్నారు. బుచ్చి మున్సిపాలిటీ రామచంద్రాపురం పిఎంశ్రీ పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్,రాజేంద్రప్రసాద్ చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు.