KMM: ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలో కూరగాయల మార్కెట్ వద్ద డ్రెయినేజీలో పడి పాల్వంచకు చెందిన కొత్తపల్లి నరేందర్ (30) అనే యువకుడు మృతి చెందాడు. మంగళవారం స్థానికులు డ్రెయినేజీలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి మార్చురీకి తరలించారు.