CTR: టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల హాల్ టికెట్‌పై పరీక్షా కేంద్రాన్ని తెలిపే క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నారు. దీని ద్వారా విద్యార్థులు కేంద్రాలను గుర్తించడం సులభతరం కానుంది. చిత్తూరు జిల్లాలోని 535 ఉన్నత పాఠశాలల నుంచి సుమారు 22 వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇందుకోసం అధికారులు 122 కేంద్రాలను ఏర్పాటు చేశారు.