WGL: పోలీస్ కమిషనర్ పరిధిలో మంగళవారం భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. కమిషనరేట్ మొత్తం కలిపి 107 కేసులు నమోదవగా, ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 46 కేసులు ఉన్నాయని పోలీస్ అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.