VSP: విశాఖ నగరంలో 1985 నుంచి ఆగస్టు 31, 2025 లోపు నిర్మించిన అనధికార భవనాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు జీవీఎంసీ ముఖ్య పట్టణ ప్రణాళికాధికారి ఎ. ప్రభాకరరావు తెలిపారు. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం కల్పించిన సదవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.