NDL: శ్రీశైలం దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో దుకాణాల్లో ప్లాస్టిక్ సీసాలు, కవర్లు వినియోగిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్ల స్థానంలో కాగితపు కవర్లు, ప్లాస్టిక్ సీసాకు బదులుగా స్టీల్, రాగి సీసాలను వినియోగించాలని వ్యాపారులకు సూచించారు.