KRNL: ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సి.బెళగల్ ఎస్సై వేణుగోపాల్ రాజు అన్నారు. మంగళవారం సి.బెళగల్లో వాహనాల తనిఖీ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. వాహనదారులకు, ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని, పరిమిత వేగంతోనే వాహనాలు నడపాలని తెలిపారు.