TG: కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. బీజేపీ బలపర్చిన అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. నజరానా ప్రకటించారు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ. 10 లక్షల ప్రోత్సాహక నిధులు ఇస్తామన్నారు. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుగుతున్నాయన్న బండి సంజయ్.. నిధులు తెచ్చేది, ఇచ్చేది తామేనని స్పష్టం చేశారు.