HYD: ఒక్కటే దెబ్బతో అదానీ, అంబానీని మించిపోయేలా రూ. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి స్కెచ్ వేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. నందినగర్‌లో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్యం చేసినట్లు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అవినీతి, అరాచకాలపై ప్రజలను చైతన్యం చేసి మన తెలంగాణ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు.