MHBD: పెండింగ్ కేసులు త్వరగా పరిష్కారం అయ్యేలా పోలీస్ అధికారులు కృషి చేయాలని SP డా.శబరీష్ సూచించారు. జిల్లా పరిధిలోని సీరోలు, మరిపెడ సర్కిల్, మరిపెడ పోలీస్ స్టేషన్లను ఎస్పీ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పోలీస్ స్టేషన్లలో అందిస్తున్న సేవల గురించి తెలుసుకున్నారు. మొదటిసారి స్టేషన్ కి వచ్చిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు.