MLG: వడ్డీ లేని రుణాలు పథకం సహాయక సంఘాల సభ్యు లైన మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని కలెక్టర్ దివాకర అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాలోని మహిళా సంఘాలకు రూ.2.7 కోట్ల విలువైన వడ్డీ లేని రుణాల చెక్కును పంపిణీ చేశారు. సాధారణంగా బ్యాంకులు విధించే వడ్డీ కంటే బయట అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకుంటున్నారని, దీంతో ఆర్థికంగా భారం పడుతుందన్నారు.