W.G: కలెక్టరేట్ ఉద్యోగులకు ఉద్దరాజు వెంకట సుబ్బరాజు మెమోరియల్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మంగళవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని అవయవాలలో కన్నా కళ్ళు ఎంతో ముఖ్యమైనవని, ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఆకుకూర తినాలని సూచించారు.